వినాయక చవితి పర్వదినం సందర్భంగా పందిళ్లు ఏర్పాటు చేయదలచిన వారు తప్పనిసరిగా ముందస్తుగా పోలీసు అనుమతులు పొందాలని బాపట్ల డిఎస్పి రామాంజనేయులు చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందుకోసం ఒక ప్రత్యేక వెబ్ సైట్ కూడా అందుబాటులో ఉందని వెల్లడించారు. అలాగే మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పందిళ్లకు మైక్ పర్మిషన్ తో పాటు అగ్నిమాపక సిబ్బంది నుండి కూడా అనుమతులు పొందాలన్నారు. పందిళ్ళ నిర్వాహకులు శాంతి భద్రతలను కూడా పరిరక్షించే బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు