కడప నగరంలో విషాదం చోటు చేసుకుంది. వినాయక చవితి రోజు బాలాజీ నగర్ లోని వినాయక మండపంలో విద్యుత్ షాక్ తో రాజారెడ్డి వీధికి చెందిన చెప్పలి సుమ తేజ (పండు) మృతి చెందారు. పండగపూట విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబంలో తీవ్రని విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.