విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని బాగా చదవాలని, ప్రపంచంలో రోజురోజుకు పోటీ తత్వం పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా మరింత ఉత్సాహంగా చదవాలని విద్యార్థులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి లో రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు పుస్తకాలు , ఇతర కిట్స్ మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ లో నూతనంగా ఏర్పాటైన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి అన్ని రకాల మౌలిక సదుపాయాల