మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఉపాధ్యాయుడు తన వృత్తిని మరిచి పదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. నీ చదువుకు అయ్యే ఖర్చు అంతా నేనే చూస్కుంటా అంటూ అసభ్య పదజాలంతో మాట్లాడుతూ విద్యార్థినిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. కొన్ని రోజుల నుంచి వేదింపులు ఎక్కువ కావడంతో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో