ట్రాక్టర్ పల్టీ కొట్టి రైతు మృతి చెందిన ఘటన గురువారం గరిడేపల్లి మండల పరిధిలోని సర్వారం గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటి ఉపేందర్ రెడ్డి ట్రాక్టర్ తో తన పొలాన్ని దున్నటానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ఉపేందర్ రెడ్డి ట్రాక్టర్ క్రింద అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.