వి.కోట: మండల సిఐ సోమశేఖర్ రెడ్డి బుధవారం తెలిపిన సమాచారం మేరకు. గోనుమకలపల్లి గ్రామానికి చెందిన ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి అదే గ్రామానికి చెందిన మంజునాథ అనే యువకుడు పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.