మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో శుక్రవారం మధ్యాహ్నం 3:00 లకు సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 18 మండలాలు 92 గ్రామపంచాయతీ పరిధిలో గల గిరిజన అర్హులైన ప్రతి ఒక్కరికి ఆది కర్మయోగి అభియాన్ పథకంను అందించాలన్నారు. ఈ పథకంలో భాగంగా ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, పీఎం జనరల్ యోజన, పీఎం కిసాన్ సమ్మస్ నిధి, యువజన రేషన్ కార్డు తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు