అనంతపురం జిల్లా ఉరవకొండ.మండలంలోని రాకెట్ల గ్రామంలో సోమవారం స్థానిక పిహెచ్సి వైద్యాధికారులు పావని వెంకటేష్ నాయక్ ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి భక్తుల కోదండరామిరెడ్డిల ఆధ్వర్యంలో దోమల నివారణ పై ప్రత్యేక కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు చికిత్సలు నిర్వహించారు. గ్రామంలో ఉదయం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అధికారులు గ్రామంలోనే ఉంది వైద్య శిబిరం నిర్వహించి ఇంటింటా వెళ్లి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. నీరు నిల్వ ఉండకుండా డ్రైడే పాటించాలని, వ్యక్తిగత, పరిసరాలు పరిశుభ్రత, దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలన్నారు