జిల్లా ఎస్.పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కడప నగరంలోని ఆలంఖాన్ పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొన్న యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) సి.ఐ ఈదురు బాషా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ “విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి, సమాజానికి మరియు దేశానికి సేవ చేయండి. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలను నెరవేర్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.