మహబూబాబాద్ జిల్లాలోని రైతులకు యూరియా పంపిణి చేయాలంటూ జిల్లాలోని గ్రోమోర్ సెంటర్ పై గురువారం మధ్యాహ్నం 3:00 లకు రైతులు రాళ్ల దాడి చేపట్టారు.. యూరియా అందించడం లేదు అంటూ గ్రోమోర్ బోర్డును రైతులు చించి వేసి పాత కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన తెలిపారు.. గత నెల రోజులుగా యూరియా పంపిణీ చేయాలని క్యూ లైన్ లో నిలిచిన ఇవ్వకుండా అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తమ పంటలు ఎండిపోతున్నాయని యూరియా ఎందుకు ఇవ్వడం లేదు అంటూ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.