ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మంగళవారం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 53వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ మందిరంలో బాబా మహా సమాధి నందు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వస్తువులు సత్యసాయి బాబా కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని బాబా కీర్తనలు ఆలపించడం జరిగింది. అనంతరం మహాసమాధికి మంగళహారతి ఇచ్చారు.