వెలిగండ్ల: రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన వెలిగండ్ల మండలం మరపగుంట్ల సమీపంలో ఆదివారం చోటి చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్కూటీపై వెలిగండ్ల వైపు వెళ్తున్న మహిళ మరపగుంట్ల సమీపంలో స్కూటీ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో మహిళలకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా కారులో వెళుతున్న వైసిపి కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ప్రమాదాన్ని గమనించి, సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం 108 అంబులెన్స్ లో గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.