ఎమ్మిగనూరు ఆసుపత్రిలో బాల భీముడి జననం..ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాల భీముడు జన్మించాడు. బుధవారం గోనెగండ్ల మండలం ఎర్రబాడుకు చెందిన జుబేదా ప్రసవం కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది.ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధా, డ్యూటీ డాక్టర్ ఫాతిమా సాధారణ కాన్పు చేయగా 4.900 కేజీల బరువుతో మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. సాధారణంగా 3.5 కిలోల బరువుతో పిలలు జనిస్తారు.