ప్రావిడెంట్ ఫండ్ రుణాల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యం కనపరచడమే కాకుండా, ఉపాధ్యాయులను వేధిస్తున్న జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబులు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడును కలిసి ప్రావిడెంట్ ఫండ్ రుణాల మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జూనియర్ అసిస్టెంట్ శివ జ్యోతి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.