రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ప్రముఖులైన మహిళల పేర్లు పెట్టాలని నవ్యాంధ్ర రచయితల సంఘం,ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు.మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాకు మహిళ పేరు లేకపోవడం విచారకరమన్నారు.స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి అన్నదాత డొక్కా సీతమ్మ పేరు పెట్టినట్లే కనీసం రెండు జిల్లాలకు మహనీయులైన మహిళల పేర్లు పెట్టాలని వారు కోరారు.