అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ ఉరవకొండ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం శత జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీ షఠస్థల బ్రహ్మ చన్న వీర శివాచార్య మహా స్వాములు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణకు మారుపేరని ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని చేదించుకుంటూ 100 సంవత్సరాలుగా దిగ్విజయంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కండ కార్యవాహ శ్రీ వినోద్ కుమార్, సాడు విక్రమ్, విజయ్, గోపి ఆచారి వందలాది స్వయం సేవకులు పాల్గొన్నారు.