సూర్యాపేట జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. కట్ట యూరియా కోసం రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఇంటికి వెళ్లాల్సిన పని లేకుండా సద్ది కట్టుకుని వచ్చామని నడిగూడెంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద మహిళా రైతులు తెలిపారు. యూరియా కోసం తెల్లవారుజామున 3 గంటలకే PACS వద్దకు చేరుకున్నామని మరికొందరు చెప్పారు. ప్రభుత్వం స్పందించి యూరియా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు.