నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో ఫిబ్రవరి 2వ తేదీ జరిగే "నిజం గెలవాలి" కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సతీమతి నారా భువనేశ్వరి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆ ఏర్పాట్లను నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు. ఇటీవల మృతి చెందిన కలువాయి మండల టీడీపీ నాయకులు బోలిగర్ల చెన్నయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ రోజు చేయాల్సిన ఏర్పాట్లు గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నాలని తెలిపారు.