ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం శృంగవృక్షం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ర్యాంక్ సిలికాన్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను మంగళవారం రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉన్నత పాఠశాలలో 4 అదనపు తరగతి గదులను నిర్మించిన దాతలు సయ్యపరాజు అప్పల నరసింహరాజు, పార్వతి దంపతులను అభినందించారు.