ఈనెల 13 న రాయదుర్గం పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కె.బాను తెలియజేశారు. లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని కోరూతూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజీ కాదగిన క్రిమినల్, సివిల్, రెవెన్యూ, ఇతర పెండింగ్ కేసులు ఈ లోక్ అదాలత్ లో పరిష్కారం చేసుకోవాలని సూచించారు.