తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ఉన్నప్రముఖ పుణ్య క్షేత్రం, పర్యాటక ప్రదేశమైన శ్రీ ఆలూరు కోన రంగనాథ స్వామి దేవస్థానం వద్ద వాటర్ ఫాల్ ఉద్ధృతంగా ప్రవస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి కూడా పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో పొంగిపొర్లుతోంది. పర్యాటకులను అటువైపు అధికారులు వెళ్ళనీయలేదు. నియోజకవర్గంలోని యాడికి తాడిపత్రి మండలాలలో గురువారం ఉదయం కూడా వర్షం పడటంతో వరద నీరు పొంగిపొర్లుతోంది.