వచ్చే నెలాఖరులోగా బిఎన్ రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేస్తామని సంబంధిత కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ అధికారులు శనివారం అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టుకు తెలిపారు. రోడ్డు సమస్యపై ఆర్క్ స్వచ్ఛంద సంస్థ, ఫోరం ఫర్ బెటర్ చోడవరం, కొందరు న్యాయవాదులు జూలైలో ప్రీ లిటిగేషన్ కేసు వేశారు. ఈ కేసు విచారణకు హాజరైన కాంట్రాక్టర్, అధికారులు ఈ హామీ ఇచ్చారు.