ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని టకారి పాలెం ప్రభుత్వ ఉర్దూ పాఠశాల విద్యార్థులు తాగునీటికి వాడుక నీటికి ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని స్థానికుల విజ్ఞప్తి మేరకు చైర్మన్ అబ్దుల్ గఫార్ నీటి పరిష్కారానికి నూతన మంచినీటి పైప్లైన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా జెసిపి సహాయంతో శుక్రవారం పనులను ప్రారంభించారు. నీటి సమస్య పరిష్కరిస్తున్న చైర్మన్ అబ్దుల్ గఫార్ కు విద్యార్థులు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.