హిమాయత్ సాగర్ జలాశయంలోకి ఓ యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. ఉప్పర్పల్లి హ్యాపీ హోమ్స్ కాలనీకి చెందిన ఆరిఫ్ అందరూ చూస్తుండగానే జలాశయంలోకి దూకాడని చెప్పారు. ఈత రాకపోవడంతో క్షణాల్లోనే యువకుడు మునిగిపోయాడన్నారు. రంగంలోకి దిగిన NDRF బృందాలు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.