ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తప్పిపోయిన ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాలిలా.. కాచిగూడ, చెప్పల్ బజార్కు చెందిన హెచ్. సీత, మురళీ దంపతుల కుమార్తె (15) ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లి సీత మంగళవారం కాచిగూడ PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.