భద్రకాళి దేవాలయ మాడవీధుల నిర్మాణం పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్ స్నేహా శబరీష్ వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని ఈ రోజు సాయంకాలం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ సందర్శించి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయడుతున్నటువంటి మాడవీధుల నిర్మాణం పనుల పురోగతిని పరిశీలించారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ కి ఆలయ చైర్మన్ బి. శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, శ్రవణ్ కుమార్ రెడ్డి, తదితరులు స్వాగతం పలికారు