తెలంగాణ ప్రజల తెగువను, పోరాటాల స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం రజాకార్లతో వీరోచితంగా పోరాడిన వీర నారీమణి చాకలి ఐలమ్మ వర్ధంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ పాలకవర్గం, రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుడా పార్క్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి, సిరిసిల్ల రోడ్ లోని చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహానికి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రజక సంఘం నాయకులు భూంపల్లి శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ