తెలంగాణలో నే మొట్టమొదటి అతిపెద్ద మట్టి వినాయకుడిని నిజామాబాద్ కేంద్రంలోని పోచమ్మ గల్లీలో ఏర్పాటు చేశారు. రవితేజ యూత్ ఆధ్వర్యంలో 1980లో వినాయక ఉత్సవాలను ప్రారంభించారు. అయితే గత 14 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితికి నెల రోజుల ముందే కలకత్తా నుంచి మట్టిని తెప్పించి 54 అడుగుల భారీ గణనాథుడిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇక్కడే ఏర్పాటుచేసి, ఇక్కడి నిమజ్జనం చేస్తామని పేర్కొన్నారు.