ఆగమ శాస్త్ర ఆధారంగా ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.మంగళవారం ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ ఆలయ ప్రాంగణం ఓపెన్ స్లాబ్ హల్ నందు రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణను వివరిస్తూ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్,దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు,రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝలతో కలిసి పాల్గొన్నారు.రాజన్న విస్తరణ,అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్కిటెక్చర్ (వాస్తు శిల్పి) సూర్య నారాయణ మూర్తి వివరించారు