రైతులకు టోకెన్లు అందించి యూరియాను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. రైతులకు ఎంత అవసరం ఉందో వ్యవసాయ అధికారుల ద్వారా తెలుసుకొని అందుకు తగ్గట్టు ఉన్నతాధికారులు యూరియా దిగుమతి చేసుకోవాలని తెలిపారు. ఒకవేళ నిజంగా కొరత ఉంటే తాము భారత ప్రభుత్వాన్ని ఒప్పించి యూరియా దిగుమతి చేయిస్తామని అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.