సదాశివ నగర్ మండలంలోని బొంపల్లి, లింగంపల్లి ముడిగం, పద్మాజివాడి గ్రామాలలో అతివృష్టి, కుంభవృష్టి వల్ల నీట మునిగి తీవ్రంగా నష్టపోయిన మక్కా పంటను మాజీ జెడ్పిటిసి పడింది రాజేశ్వరరావు పరిశీలించారు. రైతులు ఎకరానికి 50వేల రూపాయల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవాలని ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. రైతు లేనిదే ప్రజల జీవనాధారం కొనసాగదని, రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి ప్రతి కుటుంబం కడుపునింపుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.