మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మెదక్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మెదక్ లోని వెంకటేశ్వర గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన భూ నిర్వాసితులతో మాట్లాడారు. రైతులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాశాంతి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.