మామిడికుదురు మండలం, ఆదుర్రు గ్రామం మోరిపొలం లో బుధవారం రాత్రి వినాయకునికి 212 రకాల ప్రసాదాలతో మహా నివేదన సమర్పించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ జ్యోతిర్లింగార్చన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో భక్తులు ఈ పూజలకు హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు