కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఎక్కడ యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. కనిగిరిలోని ఆర్డీవో కార్యాలయంలో గురువారం యూరియా నిల్వలు మరియు సేంద్రియ వ్యవసాయంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... నియోజకవర్గంలో యూరియా కొరత ఉందంటూ ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రైతులకు అందుబాటులో 173 మెట్రిక్ టన్నుల యూరియా ఉందన్నారు. రైతులు రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని ఎమ్మెల్యే సూచించారు.