10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకువెళ్లడంతో పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఏఐఎస్ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం నాడు అనకాపల్లి జిల్లా అమకాపల్కి పట్టణంలో నెహ్రు చౌక్ జంక్షన్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో జిల్లా అధ్యక్షులు బొందు బాజ్జి, వియ్య పురాజు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎంబీబీఎస్ కలగానే మిగిలిపోతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు.