Download Now Banner

This browser does not support the video element.

మిర్యాలగూడ: పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో మెనూ పాటించని సిబ్బంది, ఆందోళన చేపట్టిన విద్యార్థులు

Miryalaguda, Nalgonda | Sep 11, 2025
నల్గొండ జిల్లా, పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో సిబ్బంది మెనూ అమలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు గురువారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గురుకుల పాఠశాల సిబ్బంది మెనూ అమలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అధికారులు మెనూ ప్రకారం చికెన్, ఇడ్లీ అందించాల్సి ఉండగా వాటిని పెట్టడం లేదన్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ ను అడిగితే ఇడ్లీ మాస్టారుకు జ్వరం వచ్చిందని, చికెన్ ఆరోగ్యానికి మంచిది కాదని సాకులు చెప్తున్నారని విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు
Read More News
T & CPrivacy PolicyContact Us