సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని ఇంద్రేశ్వర స్వామి వారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆలయాన్ని మూసివేసి తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఇంద్రేశ్వర స్వామి వారి దర్శనం భక్తులకు కల్పిస్తారని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. దయచేసి భక్తులు గమనించగలరని ఆలయ నిర్వాహకులు తెలిపారు.