Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: నగరంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ

Nizamabad South, Nizamabad | Sep 9, 2025
నగరంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో టీబి ముక్త్ భారత్ లో భాగంగా క్షయ వ్యాధిగ్రస్థులకు పౌష్టికాహార కిట్స్ ని చైర్మన్ ఆంజనేయులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికీ తమ వంతు భాగస్వామిగా కిట్స్ ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంకా వీలైతే భవిష్యత్తులో ఈ సంఖ్య పెంచుతామని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ అరుణ్ బాబు, డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం, జిల్లా టిబి కోఆర్డినేటర్ రవిగౌడ్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us