చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్.ఎస్. పేటలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రామస్వామి గుడి వీధిలో కొలువుదీర్చిన 22 అడుగుల భారీ పంచముఖ ప్రసన్న గణపతిని శనివారం కమిటీ సభ్యలు నిమజ్జనానికి తరలించారు. పట్టణంలో పలు ప్రాంతాలలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనాలకు తరలించారు.డప్పు వాయిద్యాలు, కోలాటాలు యువకుల నృత్యాలు నడుమ శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి పురవీధులలో వినాయక ప్రతిమలు ఊరేగింపు నిర్వహించారు.