సిద్దిపేట జిల్లా కేంద్రంలో 1000 పడకల ఆసుపత్రి కట్టి రెండు సంవత్సరాలు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ఎన్ జీవో భవన్ లో టి ఎన్ జీవో ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు, విద్యార్థుల కు సన్మానం కార్యక్రమం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే నన్ను కోసుకొని తిన్న పైసలు లేవు అని ముఖ్యమంత్రి అంటున్నడని, రిటైర్ అయిన ఉద్యోగులకు ఎదురు చూపులు అవుతున్నాయన్నారు. కోర్టుకు పోయినా బెనిఫిట్స్ రాని పరిస్థితి ఉందన్నారు.