ఎమ్మిగనూరు: గోనెగండ్ల, నందవరం మండలంలోని వర్షాలకు ఆందోళన చెందుతున్న రైతులు..నందవరం మండలంలో శుక్రవారం భారీ వర్షం కురవడంతో వంకలు, వాగులు పొంగి పోర్లాయి. రెండు రోజులుగా వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మండలంలో పత్తి, మిరప వంటి పంటలు 39,000 హెక్టార్లలో సాగులో ఉండగా, ఎడతెరపిలేని వర్షాల కారణంగా పత్తి పూత రాలిపోవడం, తెగుళ్లు, పురుగుల దాడితోపాటు నీరు నిలిచి పంట నాణ్యత తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.