బెల్లంపల్లి మండలం చర్లపల్లి గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో అడవి పందిని వేటాడి చంపి స్కూటీపై తీసుకువెళ్తుండగా అటవీశాఖ అధికారులు ఐదుగురి వ్యక్తులను అరెస్టు చేసారు ఈ సందర్భంగా బెల్లంపల్లి సెక్షన్ ఆఫీసర్ గౌరీ శంకర్ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం చర్లపల్లి గ్రామంలో తనిఖీలు చేపట్టగా అనుమానంగా బైక్ పై వెళుతున్న వ్యక్తుల దగ్గర తనిఖీలు నిర్వహించగా పంది మాంసం పట్టబడిందని తెలిపారు వెంటనే నిందితులను బెల్లంపల్లి ఫారెస్ట్ ఆఫీస్ కి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు