కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సును విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు భూమ్మన్న పిలుపునిచ్చారు. నగరంలో సదస్సు పోస్టులను ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కార్మికులకు 26 వేలు అమలు పరచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరికరంలో నగర అధ్యక్షులు శివ, ఉపాధ్యక్షులు మల్లికార్జున్ నాయకులు ఉన్నారు.