హరిహరపుర శ్రీ మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి శుక్రవారం కోనేటి వద్ద వెలిసి ఉన్న శ్రీశ్రీశ్రీ రామానంద తీర్థ సరస్వతి స్వామి వారి ఆరాధన మహోత్సవాలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారు భక్తులకు తీర్థ ప్రసాదం అందజేస్తూ అనుగ్రహ ఆశీర్వాదం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భక్తులు ఆరాధన మహోత్సవంలో పాల్గొన్నారు.