హిందూపురం పట్టణంలో రేపు జరగబోతున్న గణేష్ నిమర్జనానికి చేస్తున్న ఏర్పాట్లను మునిసిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి సురేంద్ర, మునిసిపల్ కమిషనర్ మల్లికార్జునలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు గణేష్ నిమర్జనం చాలా పెద్ద ఎత్తున జరగనున్నది. నిమర్జనంకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గుడ్డం కోనేరు నందు చుట్టూ విద్యుత్ దీపాలంకరణ, బారీ కేడింగ్, ఏర్పాటు చేసారు. కోనేరు లో గణేష్ విగ్రహాలను నిమర్జనం చేయడానికి ప్రత్యేకంగా మూడు క్రేన్లను తెప్పించడం జరిగింది. కోనేరు నిండా నీరు నింపి నీటి తెప్పలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.