తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో సోమవారం పెన్షన్ విద్రోహ దినాన్ని పాటిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యేలకు , ఎంపీలకు రెండు,రెండు పెన్షన్లు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం 40 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన వారికి మాత్రం పెన్షన్ లేదనటం దారుణమని యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ, ప్రధాన కార్యదర్శి మదన్మోహన్, జిల్లా నాయకులు సిర్ప హనుమాన్లు, రాధా కిషన్. సాంబశివరావు. బాల దుర్గయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.