బీఎన్ రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పూడ్చాలని సీపీఎం నాయకులు చేపలు పడుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఎన్ని సార్లు ఆందోలనలు చేపట్టినా అధికారులు, పాలకులు పట్టించుకోలేదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు అన్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. క్వారీ లారీల వల్ల రోడ్లు పాడవుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.