ఇల్లందకుంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు మంగళవారం ఉదయం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు బారులు తీరారు పోలీసుల సమక్షంలో టోకెన్లు పంపిణీ ఆధార్ కార్డు ఆధారంగా ఒక రైతుకు ఒక యూరియా బస్సును పంపిణీ చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా కోసం అష్ట కష్టాలు పడాల్సి వచ్చిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని మళ్లీ ఈ ప్రభుత్వం హయాంలో యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు యూరియా బస్తాలను సకాలంలో అందించాలని రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు.