ఒకే స్తంభానికి 60కి పైగా సీసీ కెమెరాలు చూసి అది పోలీసుల నిఘా వ్యవస్థ అనుకుంటే పొరపాటే! హుజూర్నగర్లోని ఓ వ్యాపారి తన తెలివైన ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వివేకానంద సెంటర్ నుంచి PSR సెంటర్కు వెళ్లే దారిలో ఉన్న తన సీసీ కెమెరాల దుకాణం ముందు ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసి పాడైన కెమెరాలు అమర్చారు. ఈ క్రియేటిని చూసి 'ఎవరయ్యా నువ్వు.. ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్' అని స్థానికులు అంటున్నారు.