జీవితం ఎంతో విలువైనదని, ఆత్మహత్యలే శరణ్యం కాదని మానసిక వైద్యుడు డా.జీవి రమణారావు అన్నారు. భీమవరంలో బుధవారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి మనిషి పరిపూర్ణ జీవితాన్ని ఆనందంగా అనుభవించాలన్నారు. మానవులకు సమస్యలు వస్తూనే ఉంటాయని, వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయన్నారు. సమస్యలకు ఆత్మహత్యలే శరణ్యం కాదన్నారు.